వినాయక మండపాలకు ఆన్‌లైన్ అప్లై తప్పనిసరి : ఎస్పీ హెచ్చరిక

by Sridhar Babu |
వినాయక మండపాలకు ఆన్‌లైన్ అప్లై తప్పనిసరి : ఎస్పీ హెచ్చరిక
X

దిశ, జగిత్యాల : వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని, ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్‌కు ఎటువంటి రుసుము లేదని తెలిపారు.

గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసేవారు ముందస్తుగా స్థానిక పోలీసు స్టేషన్‌లో క్లియరెన్స్ పొందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం కంప్యూటర్, మొబైల్‌లో అప్లై చేసుకోవాలని తెలిపారు. దీని కోసం http://policeportal.tspolice.gov.in అనే వెబ్‌సైట్ నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని సూచించారు.

Advertisement

Next Story