- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ లో నేర్చుకుందాం!
దిశ, వెబ్ డెస్క్ : ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం .. లాక్డౌన్ వల్ల 124 దేశాల్లోని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్న అన్ని పాఠశాలలు రెండు నెలలు మూతపడ్డాయి. దాంతో దాదాపు 1.25 బిలియన్ చిల్ర్డన్స్, యంగ్ లెర్నర్స్ మీద ఆ ప్రభావం తీవ్రంగా పడింది. కానీ నేర్చుకునే తపన ఉన్న వాళ్లందర్ని టెక్నాలజీ దగ్గర చేస్తోంది. డ్యాన్స్, సంగీతం, ఫారిన్ లాంగ్వేజెస్ ఇలా మనం ఏది నేర్చుకోవడానికైనా.. జస్ట్ మనం ఒక బటన్ దూరంలో ఉన్నామంతే. స్టోరీ టెల్లర్స్, ఆర్టిస్ట్స్, డ్యాన్సర్స్ మ్యూజిక్ టీచర్స్, ఇలా ఎంతోమంది ఆన్ లైన్ లో క్లాసులు చెబుతున్నారు. ఇందులో ఆన్ లైన్ లో ఉన్న కొన్నింటినీ గురించి మనం తెలుసుకుందాం.
1. స్టోరీ టెల్లింగ్ :
నటిగా జానకి సబేష్ మనందరికీ తెలుసే. ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గానూ పని చేస్తోంది. లిల్ ట్రేల్స్( lil trails) ఇన్స్ స్టాగ్రామ్ ద్వారా కథలు కూడా చెబుతారు. ఆమె కథలు చెబుతూ ఉంటే.. చిన్నారులు ఇంట్లోనే ఉంటూ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఇలా కథలు చెబుతూ.. పిల్లలకు వర్క్ ఇవ్వడం వారికి ఎంతగానో సంతోషంగా ఉంటుందని, వాళ్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుందని జానకి అంటున్నారు. జానకి చెప్పే కథలు వినాలంటే.. లిల్ ట్రేల్స్ ఇన్ స్టా పేజీ ఫాలో కావచ్చు. లేదంటే.. జానకి సబేష్(janakisabesh.com) లో కూడా వినొచ్చు. ఆమె పేరుతోనే యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. అక్కడ కూడా కథలు వినొచ్చు. ఢిల్లీకి చెందిన మోగ్లీస్ గురుకుల్ అనే యూట్యూబ్ చానెల్ లో కూడా కథలు చెబుతున్నారు.
2. వండర్ ల్యాబ్ :
పేరులోనే ల్యాబ్ ఉంది కాబట్టి.. ఇందులో ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని మనం అనుకుంటాం. నిజమే కానీ ఇవి కెమెస్ట్రీ ల్యాబుల్లో చేసే ప్రయోగాలు కావు. ఇంట్లోనే ఉండి… మన నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రయోగాలు. ఇందులో గంట సెషన్ ఉంటుంది. అందులో కొన్నేమో ఉచితంగా నేర్పిస్తారు. మరి కొన్నింటికి ఒక్కో సెషన్ కు రూ. 250 తీసుకుంటారు. ప్రయోగానికి సంబంధించిన మెటీరియల్ దాదాపు మన ఇంట్లోనే ఉంటాయి. వండర్ ల్యాబులో మొదటగా ‘సబ్బు’ ఎలా తయారు చేయాలో నేర్పించారు. వాటర్ కలర్స్, ఆయిల్, సాల్ట్, వాటర్ వంటి వాటితోనే ఆ ప్రయోగాలు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం wonderlab_science ఇన్ స్టా పేజీ లో తెలుసుకోవచ్చు.
3. కరాడి టేల్స్ :
డ్రమాటిక్ స్టోరీలు వినాలంటే బోర్ కొడుతుంది. అదే బొమ్మలు గీస్తూ.. స్టోరీ చెబితే.. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. కథ విత్ కరాడి అదే చేస్తోంది. ప్రముఖ చిత్రకారుడు, యానిమేటర్ చేతన్ శర్మ కూడా తన కథల కోసం బొమ్మలు ఎలా గీస్తాడో ఇందులో వివరించారు. అంతేకాదు అనురాధ శ్రీరామ్, సోహ అలీఖాన్, మాళవిక పీసీ వీళ్లంతా కూడా కరాడి టేల్స్ లో తమ కథలను చెబుతుంటారు. మరి ఆ కథలను వినాలంటే.. కరాడి టేల్స్ (karadi tales) పేస్ బుక్ పేజీ చూడాలి.
4. అత్తక్కలరి (attakkalari):
ఇందులో భిన్నమైన డ్యాన్స్ లను నేర్పిస్తారు. అంతేకాదు ఇందులో యోగా, కలియరపట్టు, భరతనాట్యం, కథక్, హిప్ హాప్ ఇలా ఎన్నింటినో నేర్పిస్తారు. ప్రస్తుతం మొదటి సెషన్ ఉచితంగానే అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు attakkalari.org చూడొచ్చు.
Tags : kids, home based sessions, online clases