- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌంటింగ్.. 40 శాతం బండిల్ వర్క్ పూర్తి
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, 12 జిల్లాల ఓట్లు ఇక్కడే లెక్కిస్తుండడం వల్ల కౌంటింగ్‌కు సుదీర్ఘ సమయం అవసరమవుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా, 3,86,320 ఓట్లు పోలయ్యాయి.
కౌంటింగ్ ప్రక్రియ 8హాళ్లలో 56టేబుళ్ల మీద జరుగుతోంది. ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున ఓట్ల లెక్కింపు సాగుతుండగా, ఇప్పటివరకు 40 శాతం బండిల్ వర్క్ పూర్తయ్యింది. ఒక్కో కట్టలో 25 ఓట్ల చొప్పున లెక్కగడుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు బండిల్స్ ప్రక్రియ పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. మొదటి ఫలితం రాత్రి 9 గంటల్లోపూ వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతోంది.
ఇదిలావుంటే.. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సైతం అన్నిఓట్లతో పాటే కలిపారు. గతంలో పోస్టల్ బ్యాలెట్లను వేరుగా లెక్కించేవారు. కానీ ఈసారి సెపరేటుగా కాకుండా అన్ని కలిపే లెక్కిస్తుండడం గమనార్హం.