బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

by srinivas |
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
X

దిశ, వెబ్‎డెస్క్ : బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా తీరం వెంబడి పయనిస్తూ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ రోజు అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. రేపు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడగా.. రాయలసీమలో భారీ వర్షాలు పడనున్నాయని అన్నారు. మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావారణ శాఖ అధికారి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed