- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్కెట్ లీడర్‌గా వన్‌ప్లస్!
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగం గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ టాప్ ప్లేస్‌ని దక్కించుకుంది. జూన్ త్రైమాసికానికి 29.3 శాతం మార్కెట్ వాటాతో భారత మార్కెట్ లీడర్‌గా నిలిచింది. కౌంటర్‌పాయింట్ సర్వే ప్రకారం..వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ రెండో త్రైమాసికంలో రూ. 30 వేలు అంతకంటే ఎక్కువ ప్రీమియం విభాగంలో టాప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా మారింది. బ్రాండ్ కంపెనీగా తమపై విశ్వాసం ఉంచిన భారత్ వినియోగదారులకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ తెలిపారు. ఎప్పటికప్పుడూ నాణ్యత కలిగిన, భారత వినియోగదారులకు ప్రీమియం ఎక్స్‌ప్రీరియన్స్ అందించడానికి తగిన ఉత్పత్తులను రూపొందించేందుకు కృషి చేస్తామని వికాస్ అగర్వాల్ వెల్లడించారు.
ఇక, ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లోకి విడుదల చేసిన వన్‌ప్లస్ 8 సిరీస్ 5జీ, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లోనూ, వినియోగదారుల నుంచి చక్కని స్పందన వచ్చిందని కంపెనీ తెలిపింది. ఆల్ట్రా ప్రీమియం విభాగంలో అత్యధికంగా అమ్ముడైన తొలి మూడు స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌పల్స్ 8 ప్రో కూడా ఉందని కంపెనీ పేర్కొంది. మొత్తమ్మీద , భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగం రెండో త్రైమాసికంలో అత్యధిక వాటాను నమోదు చేయగా, ఇందులో వన్‌ప్లస్ బ్రాండ్ గణనీయమైన వాటాను దక్కించుకుంది.
slug :