మార్కెట్‌లోకి వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలు.. ధర ఎంతో తెలుసా?

by  |
మార్కెట్‌లోకి వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలు.. ధర ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో స్మార్ట్‌టీవీ మార్కెట్‌లో మరింత విస్తరించేందుకు వన్‌ప్లస్ కంపెనీ సరికొత్త రెండు కొత్త స్మార్ట్‌టీవీలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు పేర్కొంది. వచ్చే నెల 2 నుంచి ఈ కొత్త సిరీస్ టీవీలను తీసుకురానున్నట్టు వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా సోమవారం వెల్లడించారు. ఇండియాలో వినియోగదారుల కోసం ప్రీమియమ్ వెర్షన్‌లో స్మార్ట్‌టీవీలను అందించనున్నట్టు ట్విటర్ ద్వారా ఆయన వివరించారు. గతేడాది ప్రారంభ ధరల్లో రూ. 69 వేలల్లో వన్‌ప్లస్ రెండు వేరియంట్ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చిన తర్వాత, ప్రస్తుతం బడ్జెట్ రేంజ్‌లో ఇండియాలోని కస్టమర్లను ఆకరించడానికి ఈ సరికొత్త వెర్షన్‌లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ నుంచి రానున్న ఈ కొత్త స్మార్ట్‌టీవీల్లో ఉండే ప్రత్యేకతల గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదు. స్మార్ట్‌టీవీ, స్మార్ట్ ధర అనే పేరుతో సంస్థ వ్యవస్థాపకులు వీటికి ప్రచారం కల్పిస్తున్నారు. బెస్ట్ ఇన్ క్లాస్ డిస్‌ప్లే అని, వేరువేరు స్క్రీన్ పరిణామాలలో మిడ్-రేంజ్, ఎంట్రీ లెవల్ విభాగాల్లో ప్రీమియమ్ అనుభూతిని అందిస్తాయని మార్కెట్లో అంచనాలున్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌టీవీల ధర రూ. 15 వేల నుంచి ప్రారంభమవనున్నట్టు భావిస్తున్నారు. ఒకవేళ ఈ ధరల్లోనే స్మార్ట్‌టీవీలను తెస్తే ఇప్పటికే బడ్జెట్ రేంజ్‌లో టీవీలను విక్రయిస్తున్న షావోమీ, వీయూ బ్రాండ్‌లకు పోటీ తప్పదు.


Next Story

Most Viewed