తెల్లవారుజామున ఉగ్రవాది హతం

by Shamantha N |
తెల్లవారుజామున ఉగ్రవాది హతం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాంలోని నాగ్నార్ చిమ్మెర్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. ఇంకా ఆ వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story