మునుగోడులో కరోనా పాజిటివ్ కేసు

by Shyam |   ( Updated:2022-08-31 14:03:27.0  )
మునుగోడులో కరోనా పాజిటివ్ కేసు
X

దిశ, నల్లగొండ: మునుగోడు మండలం పులిపలుపుల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. ఇటీవల ముంబయి నుంచి వచ్చిన వలస కూలీకి గురువారం వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో మునుగోడు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసు, రెవిన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకుని సదరు వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వలస వెళ్లిన గట్టుపల్ గ్రామానికి చెందిన ఏడుగురు స్వస్థలాకు తిరిగిరావడంతో వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు పోలీసులు.

Advertisement

Next Story