- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలమూరులో తొలి కరోనా మరణం
దిశ, మహబూబ్‌నగర్: నిన్న మొన్నటి వరకు జిల్లాలో పెద్దగా కరోనా మహమ్మారి భయం కనిపించలేదు. కాని కరోనా కట్టడికి జనం సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడమూ భయం కలగకపోవడానికి కారణం కావొచ్చు. కాని సోమవారం నాడు రాత్రి కరోనా కారణంగా వ్యక్తి మరణించడంతో పాటు మరో 11మందికి వ్యాధికి సోకిఉందొచ్చనే అనుమానాలు జిల్లా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నెల డిల్లీలో జరిగిన మత ప్రచార సభకు వెళ్లిన వారికి కరోనా సోకిందనే వార్తలు రావడంతో జిల్లా అధికారులూ అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరెవరు ఈ మత ప్రచార సభకు వెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మొత్తం 13 మంది సభకు హాజరయినట్లు అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. గద్వాల జిల్లా శాంతినగర్ మండలంకు చెందిన వృద్ధుడూ సభకు వెళ్లినట్టు గుర్తించారు. అదే సమయంలో ఇంకా వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఎంత మంది ఈ సభలకు వెళ్లారనే విషయం బయటపడాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈ నెల 19వ తేదిన అస్వస్థతకు గురికావడంతో అక్కడే వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం అతడు మృతి చెందాడు. అయితే, మొదట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు అధికారులు చెప్పిన అనుమానంతోని అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని కుటుంబసభ్యుల్లో నలుగురిని హైదరాబాద్‌కు తరలించారు.
అతనితో 11 మంది సభకు..
ఢిల్లీలో జరిగిన మత ప్రచార సభకు అతనితోపాటు మరో 12 మంది వెళ్లినట్టు అధికారులకు తెలిసింది. అతను తప్ప ఆ 11 మంది నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారి రక్తనమూనాలను సేకరించారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన హెల్త్ అసిస్టెంట్ హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహించగా అతనికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అతని తల్లికి కూడా వైరస్ సోకిందనే అనుమానంతో ఆమెను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉంటే తమకు సమాచారమివ్వాలని అధికారులు కోరుతున్నారు. అధికారులు ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చిన వారు గత పది రోజులుగా స్థానికంగా ఉన్నారనీ, వారు ఎవరెవరిని కలిసారు, కుటుంబ సభ్యులు ఎవరిని కలిసారు అనే విషయాలు ఆరా తీస్తున్నారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.
Tags: person died, due to, corona virus , covid19