- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కరోనా @ 8
ఆంధ్రప్రదేశ్‌లో రోజుకొక కరోనా పాజిటివ్ కేసు నమోదవుతూ ఆందోళన పెంచుతోంది. ఇప్పటి వరకు 7 కేసులు నమోదు కాగా, తాజాగా శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8కి చేరింది. అతనికి ట్రావెల్ రికార్డు ఉంది. లండన్ నుంచి ఈ మధ్యే ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 14 మంది శాంపిల్స్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు విదేశాల నుంచి 14,907 మంది వచ్చారు. అందులో తాజాగా వచ్చిన 453 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కడప, విశాఖ, గుంటూరుల్లో కరోనా పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో రోజుకు 1000కి పైగా శాంపిల్స్ పరీక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా ఆందోళన నేపథ్యంలో 12,131 పడకలతో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా పరీక్షలకు నిపుణులను కూడా నియమించింది. ప్రతి రోజూ సాయంత్రం కరోనా బులిటెన్ విడుదల చేసేలా ఏర్పాట్లు చేసింది.
Tags: ap, coronavirus, covid-19, hospitals, quarantine centers