- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కరోజులో మిలియన్ డాలర్లు ‘ఆమె’ సంపాదన
దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో డబ్బు సంపాదించడానికి ప్రత్యేకించి ఏమీ అక్కర్లేదు. ఇంటర్నెట్ ఉంటే చాలు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ జిమ్మిక్కులు తెలిస్తే మాత్రం ఊహించలేనంత స్థాయిలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇక ఇన్‌స్టాగ్రాం మార్కెటింగ్ ద్వారా ఒక్కరోజులో ఒక్క మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇది వినడానికి చాలా విడ్డూరంగానే ఉండవచ్చు. కానీ, ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ద్వారా ఇది సాధ్యమేనని ఆస్ట్రేలియాకు చెందిన గ్రెట్టా రోస్ వాన్ రీల్ నిరూపించింది. ఈమెను అందరూ ఇన్‌స్టాగ్రాం క్వీన్ అని అందుకే పిలుస్తుంటారు. మరి ఆమె ఏం చేసింది? ఏం బిజినెస్‌లు నడుపుతోంది? ఎలా నడుపుతోందనేది ఇక్కడ తెలుసుకుందాం.
గ్రెట్టా మొదటి ఈ-కామర్స్ కంపెనీ పేరు స్కిన్నీమీ టీ. ఈ కంపెనీ ద్వారా ఆమె ఆరు నెలల పాటు నెలకు రూ. 6 లక్షలు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 3 లక్షల మంది లాయల్ కస్టమర్‌లు ఉన్నారు. ఆ తర్వాత ద ఫిఫ్త్ వాచెస్ అనే కంపెనీని గ్రెటా ప్రారంభించింది. ఈ కంపెనీ ద్వారానే ఆమె 2015, డిసెంబర్ 5న ఒక మిలియన్ డాలర్లను సంపాదించింది. ఇవి కాకుండా డ్రాప్ బాటిల్, హే ఇన్‌ఫ్లూయెన్సర్స్ అనే కంపెనీలను గ్రెటా నడిపిస్తోంది. అటు బ్రాండ్‌లను ఇటు ఇన్‌ఫ్లూయెన్సర్‌లను కలపడమే ఈ హే ఇన్‌ఫ్లూయెన్సర్స్ కంపెనీ ముఖ్య ఉద్దేశం. అన్ని కంపెనీల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, గ్రెటా వ్యక్తిగత ఖాతాను కలిపితే ఈమె ఫాలోవర్ల సంఖ్య 16 మిలియన్లు దాటుతోంది.
మెల్‌బోర్న్ యూనివర్సిటీలో మీడియా కమ్యూనికేషన్స్ చదివిన గ్రెటా, గ్రాడ్యుయేషన్ తర్వాత లైఫ్ గార్డ్ ఉద్యోగంలో చేరింది. కానీ ఆ ఉద్యోగం ఆమెకు ఇష్టం లేదు. డిజిటల్ మార్కెటింగ్ చదువుకుంది కాబట్టి ఒకసారి ఆ ఉద్యోగాల కోసం చూసింది. వార్తాపత్రికలు కాస్త డిజిటల్ పేపర్‌లుగా మారుతున్న తరుణంలో ఆమె ఒక డిజిటల్ మార్కెటింగ్ హెడ్‌గా ఉద్యోగాన్ని సంపాదించింది. ఆ ఉద్యోగంలో చేరిన 3 నెలలకే స్కిన్నీమీ టీ స్టార్టప్‌ను ప్రారంభించింది. అప్పట్లో ఎంఎస్‌ఎన్, మై స్పేస్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ అవి తెలిసిన వాళ్లకు, స్నేహితులకు మాత్రమే పరిమితం అయ్యేవి. కాబట్టి ఎలాగోలా తన టీ ఉత్పత్తులను ముందుగా స్నేహితులకు, తెలిసిన వాళ్లకు అమ్మడం, దాని రుచి వారికి నచ్చి నోటి మాట ద్వారా ఇంకొందరు వినియోగదారులు రావడం ప్రారంభమైంది. మే 2012 నాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రెటా ఖాతాను తెరిచింది. అప్పటికీ ఇన్‌స్టాలో ఇలా బిజినెస్ చేయొచ్చని ఎవరికీ తెలియదు. కానీ గ్రెటా ఆగిపోలేదు. తన టార్గెట్ ఆడియెన్స్ ఎవరో తెలుసుకుని అందరికీ ఫాలో రిక్వెస్ట్‌లు పంపించేది. ఒకరిద్దరు అప్రోచ్ అయ్యి టీ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అలా దాదాపు సిడ్నీ, మెల్‌బోర్న్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉన్న అందరినీ గ్రెటా ఫాలో అవడంతో తన కంపెనీ పాపులర్ అయిపోయింది. 2013లో షాపిఫై వారి బిల్డ్ ఇన్ బిజినెస్ అవార్డును అందుకుంది.
దీంతో ఆమె బిజినెస్ గురించి అందరికీ తెలిసిపోయి, పోటీగా కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. అప్పుడు గ్రెటాలో కాసింత భయం మొదలైంది. ఒకవేళ రేపు తన బిజినెస్ తగ్గిపోతే.. అనే సందేహం ఏర్పడింది. అందుకే ఎలాగో ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ మీద ఇప్పుడు తనకు పట్టు తెలిసింది. కాబట్టి మరో బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించింది. అప్పుడే ద ఫిఫ్త్ వాచెస్ అనే చేతి గడియారాల కంపెనీని స్థాపించింది. ఈ వాచీలు ఆవిష్కరించడానికి ముందు ఒక 30 వాచీలను ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు పంపించింది. వారు దాని గురించి రివ్యూ చేసి వారి ఖాతాల్లో వీడియోలు అప్‌లోడ్ చేశారు. తర్వాత వాచ్ అమ్మకాలు ప్రారంభం కాగానే క్షణాల్లో అమ్ముడుపోయాయి. ఈ వ్యాపారం పూర్తిగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే సాగింది. ప్రతి నెల ఐదు రోజుల పాటు మాత్రమే ఈ వాచీలను అమ్ముతారు. మిగతా 25 రోజుల పాటు ఇన్‌ఫ్లూయెన్సర్‌ల ద్వారా మార్కెటింగ్ చేయిస్తారు. అందుకే ఆ ఐదు రోజులు ఒక్క వాచీ మిగలకుండా అమ్ముడుపోతాయి.
ఇలా మార్కెటింగ్ మీద గ్రిప్ మరింత పెరిగిన తర్వాత హే ఇన్‌ఫ్లూయెన్సర్స్ కంపెనీని ప్రారంభించింది. దీని ద్వారా తన కంపెనీ ఉత్పత్తులకు మాత్రమే కాకుండా తనలాంటి ఇతర స్టార్టప్ కంపెనీల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను గ్రెటా పెంచుతోంది. అయితే స్టార్టప్‌ను ప్రారంభించాలనుకుని తనలాగా ఎదగాలనుకునేవారికి గ్రెటా ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే..వీలైనంత తక్కువలో ప్రారంభించండి, ఉత్పత్తి నాణ్యతతో పాటు నమ్మకస్తులైన వినియోగదారులను సంపాదించుకోండి. మరి ఇప్పుడు మన దగ్గర పూర్తిస్థాయిలో ఈ ఇన్‌స్టాగ్రాం మార్కెటింగ్ అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఏదైనా స్టార్టప్ పెట్టాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఒక్కసారి ఈ మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేయండి.