సైబరాబాద్ పోలీసులకు లక్ష సర్జికల్ మాస్కులు

by Shyam |
సైబరాబాద్ పోలీసులకు లక్ష సర్జికల్ మాస్కులు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరంతరం విధుల్లో నిమగ్నమవుతున్న పోలీసులకు మైక్రాన్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ లక్ష సర్జికల్ మాస్కులను అందజేసింది. బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు మాస్కులను అందజేశారు. ఈ మాస్కులను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు అందజేస్తామన్న సీపీ, సర్జికల్ మాస్కులను అందజేసిన మైక్రాన్ టెక్నాలజీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story