ప్రతి నాలుగింట ఒకటి ఫేక్ వీడియోనే!

by vinod kumar |
ప్రతి నాలుగింట ఒకటి ఫేక్ వీడియోనే!
X

కొవిడ్-19 గురించి తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయాలని యూట్యూబ్ చాలా ప్రయత్నించింది. కానీ, ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇంగ్లిషు భాషలో ఉన్న ప్రతి నాలుగు వీడియోల్లో ఒకటి తప్పుడు సమాచారంతో ఉన్నదేనని ఓ అధ్యయనంలో తేలింది. ఈ వీడియోల్లో ఎక్కువగా కరోనాకు మందు దొరికిందని, కంపెనీలు అమ్మడానికి నిరాకరిస్తున్నాయని, కొన్ని దేశాలు కావాలని కరోనా వ్యాపింపజేస్తున్నాయనే వీడియోలే ఎక్కువగా ఉన్నాయట. వీటితోపాటు సాధారణ ప్రజలకు తప్పుడు లింకులు పంపే వీడియోలు, వివక్షాపూరితమైన, వివాదాలు తీసుకొచ్చే సిద్ధాంతాలు ఊహాగానాల వీడియోలు కూడా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాకు చెందిన మెడికల్ స్టూడెంట్ హైడీ ఓయ్ యీ బృందం చేసిన అధ్యయనం గురించి బీఎంజే గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించారు. ఈ తప్పుడు సమాచారంతో ఉన్న వీడియోలకు వీక్షణలు కూడా అధికంగానే ఉన్నాయని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. వారు ఎంచుకున్న శాంపిల్‌లో పావు భాగం వీడియోలు ఫేక్ న్యూస్‌కి సంబంధించినవే. అయితే ఈ వీడియోలు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఛానళ్లు, ఇంటర్‌నెట్ వార్తా ఛానళ్ల నుంచే వచ్చాయి. తాము తప్పుడు వీడియోలను తొలగించడానికి పూర్తిస్థాయిలో కష్టపడుతూ ఒకరోజు 1000కిపైగా వీడియోలను తొలగిస్తున్నట్లు గూగుల్ గతంలో పేర్కొంది. అయినప్పటికీ ఇంత మొత్తంలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed