డ్రైవర్ మృతి.. క్యాబిన్‌లో క్లీనర్ కాళ్లు

by Anukaran |
డ్రైవర్ మృతి.. క్యాబిన్‌లో క్లీనర్ కాళ్లు
X

దిశ, ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదం జరిగి డ్రైవర్ మృతి చెంది.. క్లీనర్ కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కొని నాలుగు గంటలపాటు నరకం చూసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుక్కుగూడ నుండి ఘట్ కేసర్ వైపు వెళ్తుండగా మహేశ్వరం మండలం రావిరాల ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో అక్కడే రోడ్డుపై నిలిపివేశారు.

అయితే ఈ లారీని వెనుక నుంచి డీసీఎం ఢీకొన్నది. అయితే ఈ డీసీఎం కర్నూల్ నుంచి వరంగల్ కు మిర్చి లోడ్ తో వెళ్తున్నది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం క్యాబిన్ లో క్లీనర్ కాళ్లు ఇరుక్కుపోయాయి. దీంతో అతడిని మెల్లగా బయటకు తీసి.. అతనితోపాటు లారీ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన ఎరుకల తిమ్మరాజుగా గుర్తించారు.

Advertisement

Next Story