- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానం: మంత్రి మల్లారెడ్డి
దిశ, మేడ్చల్ ప్రతినిధి: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలటీ పరిధిలోని 18వ వార్డులో 75 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం మూలంగా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అందువల్ల ప్రతి కాలనీలో కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా కాలనీలలో కెమెరాలను పెట్టించిన దాతలను మంత్రి సత్కరించారు. అనంతరం రూ.26 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డుకు, వార్డు ఆఫీస్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్ పాల్గొన్నారు.