- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేన్సర్ పెరిగిందని ఆంకాలజిస్టుల ఆందోళన
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి పెరుగుతున్నట్లు గ్రేట ర్హైదరాబాద్కు చెందిన పలువురు ఆంకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపంతో చాలా మంది వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారని, దీంతో చికిత్స అందించడం కష్టమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్‌ఎమ్‌డీసీ గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో కేన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా ఆంకాలజిస్టులు మాట్లాడుతూ కేన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే జయించడం పెద్ద కష్టమేమికాదన్నారు. మొదటి, రెండో దశలో గుర్తిస్తే కొన్ని రకాల మందులతో వ్యాధిని తగ్గించవచ్చన్నారు. అయితే వ్యాధి నియంత్రణకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోగికి ఆర్థిక భారం పడకుండా ఆదుకోవాలన్నారు.
ఈ మేరకు గత కొన్ని రోజుల నుంచి గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రజల్లో కేన్సర్‌పై అవగాహన కలిగించేందుకు, దాని నివారణకు వివిధ రకాల కార్యక్రమాలు చేయడం మంచి పరిణామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చిన్నబాబు, ప్రమీల, సుబిత్ దూబే, తదితరులు పాల్గొన్నారు.