- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ ప్రధాని వివాదాస్పదం: స్త్రీలను అలా చూస్తే.. మగాళ్లకు కోరికలు కలగవా..?
దిశ, వెబ్‌డెస్క్: మహిళల వస్త్రధారణ పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో లైంగిక వేధింపుల కేసులు పెరగడానికి మహిళల వస్త్రధారణే కారణమని ఇమ్రాన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇటీవల ఓ అంతర్జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇమ్రాన్ మాట్లాడుతూ ” స్త్రీలు పొట్టి పొట్టి బట్టలు ధరిస్తే.. మగవారిపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మగవాళ్లేమైనా రోబోలా.. వారికీ కోరికలు ఉండవా.. స్త్రీలు తమ శరీరం కనిపించేలా బట్టలు వేసుకొంటే.. చూసిన మగవారి మనసు తప్పకుండా చలిస్తుంది. పురుషులు రోబోలు అయితే తప్ప.. చలించకుండా ఉండలేరు. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం” అని ఇమ్రాన్ తెలిపారు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలలో అగ్గి రాజేశాయి.
ఒక ప్రధాని అయ్యి ఉండి.. మహిళల గురించి,. వారి వస్త్రధారణ గురించి ఇలా మాట్లాడం సరికాదని మండిపడ్డారు. స్త్రీలు వేసుకొనే బట్టల వలనే అత్యాచారాలు జరుగుతుంటే మరి చిన్నపిల్లలు, వృద్దులు ఎలాంటి వస్త్రాలు వేసుకొంటున్నారని వారిపై అత్యచారాలు జరుగుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్, దక్షిణ ఆసియా న్యాయ సలహాదారు రీమా ఒమర్ అత్యాచారాలకు, వస్త్రధారణకు ముడిపెట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా ప్రధాని లైంగిక వాంఛలకు సంబంధించి ఒక లైన్ లో మాట్లాడితే దాన్ని అందరు తప్పుగా అర్ధం చేసుకొన్నారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు. ప్రధాని ఇమ్రాన్ కి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతేడాది ఏప్రిల్ లోను మహిళలపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసుపాలైనా విషయం తెల్సిందే.