ఆ లెజెండరీ క్రికెటర్ చరిత్ర సృష్టించింది ఈ రోజే..!

by Shiva |   ( Updated:2021-03-16 06:38:51.0  )
ఆ లెజెండరీ క్రికెటర్ చరిత్ర సృష్టించింది ఈ రోజే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాలో లెజెండరీ క్రికెటర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అతడు అన్ని ఫార్మాట్‌లకు గుడ్ బై చెప్పి చాలా కాలం అయినా చేసిన రికార్డులు మాత్రం క్రికెట్ చరిత్రలో చెక్కు చెదరనివి. ఎంతో మంది యువ క్రికెటర్లకు అతడి ఆటతీరు ఆదర్శనీయం. అంతర్జాతీయ స్టార్ బ్యాట్స్‌మెన్‌లల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన తొలి ఆటగాడు అతడే. అనతి కాలంలోనే 100 సెంచరీలు పూర్తి చేసుకున్న ‘మాస్టర్ బ్లాస్టర్’ .. సరిగ్గా 9 ఏండ్ల క్రితం ఈ రోజే చరిత్ర సృష్టించాడు.

2012లో జరిగిన ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా జట్టు బంగ్లాతో తలపడుతోంది. ఇదే సమయంలో క్రీజులో పుంజుకున్న సచిన్ టెండూల్కర్ పరుగుల వరద పారించసాగాడు. అప్పటికే అంతర్జాతీయ మ్యాచుల్లో 99 సెంచరీలు చేసిన అతడు ఆ మ్యాచ్‌తోనే 100వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 147 బంతులు ఆడిన సచిన్.. 114 పరుగులు చేయగా.. తొలి 138 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ తనదైన ముద్ర వేశాడు.

Advertisement

Next Story

Most Viewed