రాత్రి పడుకునే ముందు ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

by Kavitha |   ( Updated:2024-10-09 05:02:56.0  )
రాత్రి పడుకునే ముందు ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎండుకొబ్బరిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఎండుకొబ్బరిని ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మరి ఈ లాభాలేంటో ఇప్పుడు మనం చూద్దాం..

* కొబ్బరి చాలా రుచిగా ఉండటం వలన పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరిలో ఐరన్, పొటాషియం, calcium, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అయితే దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం కన్నా రాత్రి పడుకోవడానికి ముందు చిన్న ముక్క తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

* రాత్రి సమయంలో కాస్త ఎక్కువగా ఆహారం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట సమస్యలు వచ్చేస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే రాత్రి పడుకోవడానికి అరగంట ముందు చిన్న కొబ్బరి ముక్క తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

* అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు.

* ఇక రోజూ కొబ్బరి తినడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మంచి నిద్ర పడుతుంది.

* ఈ విధంగా రాత్రి సమయంలో చిన్న కొబ్బరి ముక్క తినడం వలన మరుసటి రోజు నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి లేకుండా చురుగ్గా ఉంటారు. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.

* అంతే కాకుండా కొబ్బరిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే.

* అదే విధంగా కొబ్బరిలో calcium సమృద్ధిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed