- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MPC Meeting: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబాయి (Mumbai) వేదికగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) అధ్యక్షతన జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లుగా శక్తికాంత దాస్ తెలిపారు. రెపో రేటు (Repo Rate)(ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీ రేటు)ను 6.5 శాతం వద్దే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు (Standing Deposit Facility Rate)ను 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (Marginal standing facility rate)ను 6.75 శాతంగా నిర్ణయించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపో రేటును యథావిథిగా కొనసాగించడం ఇది పదోసారి కావడం విశేషం.
కాగా, ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee)లో ఇటీవలే స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు ఎక్స్‌టర్నల్ సభ్యులుగా అషిమా గోయల్, శశాంక భిడే, ఆర్.జయంత్ వర్మ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. దీంతో కేంద్రం తాజాగా వారి స్థానంలో రామ్‌సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను నియమించింది. దీంతో వారు తొలిసారిగా ద్రవ్య పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee) సమావేశానికి హాజరయ్యారు.