- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Food for a Day: పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజు ఎంత తినాలి..?
దిశ, వెబ్‌డెస్క్: కూటి కోరకు కోటి విద్యలు అని తరచూ పెద్దలు అంటుంటే వింటూనే వింటాం. కాగా ఆరోగ్యంగా ఉండేందుకు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. మనం ఎంత సంపాదించినా హెల్తీగా లేకపోతే వేస్ట్. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో చాలా మంది హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడమే మాత్రమే కాకుండా సరైన సమయానికి కూడా తిండి తినట్లేదు. కాగా ఎన్నో రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది మాత్రం వ్యాయామాలు చేస్తూ సరైన టైమ్ కు ఫుడ్ తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కాగా వీరు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఎంత ఆహారం తినాలో ఆరోగ్య నిపుణులు తాజాగా తెలిపారు. ఒక వ్యక్తి రోజు ఎంత తినాలో ఇప్పుడు చూద్దాం..
రోజుకు ఇన్ని కేలరీల ఫుడ్ అవసరం..
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారు మహిళలు అయితే రోజుకు 2, 000 కేలరీలు తీసుకోవాలి. పురుషులు అయితే 2500 కేలరీలు, 1200 నుంచి 1400 కేలరీలు పిల్లలకు అవసరం. ఒక వ్యక్తి రోజుకు ఎంత ఫుడ్ తీసుకోవాలనేది వారి లింగం, ఎత్తు, బరువు, చేసే పనులపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే తిన్నప్పుడే మరీ ఎక్కువగా కూడా తినకూడదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు తేలికపాటి ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువ టైమ్స్ తీసుకోవాలి. నైట్ కూడా సూర్యాస్తమయానికి ముందే తినాలి.
జీర్ణాశయాన్ని మూడు విభాగాలుగా విభజించుకోండి..
మధ్యాహ్నం, రాత్రికి కనీసం ఆరు గంటల గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్‌లో ఆహారం జీర్ణం అవుతుంది. కడుపు మొత్తం నిండేలా మాత్రం ఫుడ్ తినకూడదు. మీ జీర్ణాశయాన్ని మూడు భాగాలుగా విభజించుకోండి. ద్రవాలు, ఘన పదార్థాలు, ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం ఎప్పుడైనా సరే 80 శాతం మాత్రమే తినాలి. ఎక్కువగా వేడి వేడి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు. రాత్రి పడుకునే 3 గంటల ముందే ఫుడ్ తీసుకోవాలి.
హెల్తీగా ఉండాలంటే..
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు చేసిన సలహాలు, సూచనలు చూద్దాం.. రోజూ వ్యాయామాలు చేయాలి. మొలకెత్తిన గింజలు, ఉడకబెట్టిన పప్పులు తినాలి. అలాగే ఎగ్ వైట్, చిరుధాన్యాలు తీసుకోవాలి. వ్వు, చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవి తినొద్దు. వాటర్ ఎక్కువగా తాగాలి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.