- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నారింజ రంగులో కనువిందు చేయనున్న పూల చంద్రుడు
దిశ, వెబ్ డెస్క్ :
ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి చందమామతో ఓ విడదీయరాని అనుబంధం ఉంటుంది. చందమామను చూస్తూ ఉండిపోతే భలే బాగుంటుంది కదా! అందులోనూ వెన్నెల విరిసే రోజూ మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది మూడు సార్లు నిండుగా కనిపించి కనువిందు చేసిన చందమామ.. మరోసారి సంపూర్ణ చంద్రునిగా కనిపించనున్నాడు. మే 7న బుద్ధ పూర్ణిమ రోజు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.15 గంటల సమయంలో చందమామ భూమికి మరింత చేరువగా రానుంది. గత నెలలో పింక్ మూన్ చూసి మురిసిపోయాం. ఈ సారి ‘ఫ్లవర్ మూన్’ ను చూడబోతున్నాం. అది కూడా ఒక్క రోజు కాదు.. మూడు రోజుల పాటు వెండి వెలుగులతో చంద్రుడు వెన్నెల కురిపించనున్నాడు.
బుద్ధపూర్ణిమ రోజున వచ్చే నిండు చంద్రుడిని ఫుల్ మూన్, బ్లడ్ మూన్ అనే పేరుతో పిలుస్తుంటారు. కానీ, ఈసారి వెన్నెల కురిపిస్తున్న చంద్రుడిని ‘ఫ్లవర్ మూన్’ గా పేర్కొంటున్నారు. సాధారణంగా మే నెలలో పువ్వులు వికసిస్తాయి. అందువల్ల దీన్ని ‘సూపర్ ఫ్లవర్ మూన్’గా పిలుస్తున్నారు. అమెరికాలో గిరిజనులు… మే నెలలో పూలతో కొన్ని ఆచారాలు పాటించేవారు. అందువల్ల కూడా మేలో వస్తున్న చందమామను సూపర్ ఫ్లవర్ మూన్ గా పిలుస్తున్నారు. మరికొంతమంది దీన్నే ‘కార్న్ ప్లాంటింగ్ మూన్’, ‘మిల్క్ మూన్’ కూడా పిలుస్తున్నారు. 1979 తరువాత భూమికి దగ్గరగా ఉన్న ‘పెరొగి’ కక్ష్యలోకి చంద్రుడు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మే 7న కనిపించే చందమామ రోజూ కంటే… 14 శాతం పెద్దదిగా ఉంటుంది. అలాగే… రోజు కంటే 30 శాతం ఎక్కువ కాంతితో కనిపిస్తుంది. అమెరికా ఖగోళవేత్త రిచర్ నోల్లే… 1979లో ఈ సూపర్ మూన్ పదాన్ని సృష్టించారు. మే 7న మన భూ వాతావరణం కారణంగా చందమామ… నారింజ రంగులో కనిపిస్తూ ఆకట్టుకోనుంది. అయితే మన భారతీయులు మాత్రం దీన్ని చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఇది మనకు సాయంత్రం వేళల్లో వస్తుండటంతో.. ఆ టైమ్ లో చంద్రుడు అప్పుడప్పుడే వస్తూ ఉంటాడు. అందువల్ల అంత ప్రకాశంగా కనిపించకపోవచ్చు. కానీ ఆన్ లైన్ లైవ్ లో చూడొచ్చని ఖగోళ వేత్తలు చెబుతున్నారు.
సూపర్ మూన్ అంటే :
సూపర్ మూన్ అంటే భూమికి చంద్రుడు అత్యంత సమీపంగా రావడం. ఈ సమయంలో చందమామ మరింత పెద్దదిగా, మరింత ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సంపూర్ణంగా వచ్చే చంద్రుడు ప్రతిసారి.. ‘సూపర్ మూన్ ’ కావాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఏర్పడిన సూపర్ మూన్ ను‘స్నో మూన్’గా, మార్చిలో ఏర్పడిన సూపర్ మూన్ ను ‘సూపర్ వార్మ్ మూన్’గా, ఏప్రిల్ లో ‘పింక్ సూపర్ మూన్’గా పిలుచుకున్నాం. ఇప్పటివరకు 79 సూపర్ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్ మూన్ వస్తూనే ఉంది. ఇప్పుడు మే లో వచ్చే ‘ఫ్లవర్ మూన్ ’ ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూపర్ మూన్.
సూపర్ బ్లడ్ మూన్ :
చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే ‘సూపర్ బ్లూ బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. చందమామ సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు.
Tags: sky, full moon, flower moon, super moon