- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళలో వధువు, యూకేలో వరుడు.. ఆన్‌లైన్‌లో పెళ్లి
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా అతిరథ మహారథుల సమక్షంలో, అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన వివాహం ఇరువురు కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకోవాల్సి వస్తోంది. ఇరవై మందికి మాత్రమే ప్రభుత్వాలు కూడా అనుమతించడంతో బంధువులను పిలిచి ఇబ్బందులు పడతామని ఎలాంటి ఆర్భాటం లేకుండానే పెళ్లి చేసేస్తు్న్నారు. అయితే, కరోనా సమయంలో ఇతర దేశాల్లో ఉన్న వారితో నిశ్చితార్థాలు జరగడం చూశాం. అంతేకాకుండా, ఇరువురు కుటుంబాల మధ్య పెళ్లి జరుగుతుంటే.. ఎవరి ఇంట్లో వాళ్లు ఆన్‌లైన్‌లో చూసి ఆశీర్వదించే విధంగా సదుపాయాన్ని తీసుకొచ్చారు.
అయితే, కేరళ హైకోర్టు ఆన్‌లైన్ పెళ్లికి అనుమతి ఇస్తూ సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన రింటు థామస్, అనంత కృష్ణన్ హరికుమారన్‌లకు ఈ నెల 23న పెళ్లి నిశ్చయమైంది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలకు ఆంక్షలు ఉండటంతో వరుడు ఇండియాకి రాలేకపోయాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవాలని పెద్దలను ఒప్పించారు.
అయితే, వివాహం చెల్లుబాటు అయ్యేలా తిరువనంతపురం సబ్ రిజిస్ట్రార్‌కు ఆదేశించాలని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఆన్‌లైన్ ద్వారా వివాహాన్ని జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే, సంతకాలు అవసరం ఉన్న చోట వరుడికి బదులు అతరి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ సంతకాన్ని తీసుకోవాలని సూచించింది. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత వివాహ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌కు తెలిపింది. దీంతో ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే పెళ్లి జరగనుంది.
- Tags
- high court
- kerala