- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘OMG 2’ పోస్టర్ రిలీజ్.. నీలి రంగులో అక్షయ్ కుమార్
దిశ, సినిమా: 2012లో విడుదలైన ‘ఓ మై గాడ్’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ‘OMG 2’కు సంబంధించిన పోస్టర్‌ను మూవీ హీరో అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేశాడు. మొదటి మూవీ లీడ్ రోల్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన పరేశ్ రావెల్ నటించగా.. ఇప్పుడు ఈ సినిమాకి సిక్వెల్ ‘OMG 2’ రానుంది. మొదటి ‘ఓఎమ్‌జీ’లో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్.. ‘ఓఎమ్‌జీ 2’లో శివుడిగా కనిపించనున్నాడు. కాగా ఈ పోస్టర్‌లో మొత్తం నీలి రంగులో ఉన్న అక్షయ్ కళ్ళు మూసుకుని ఓ యువకుని చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇక కింద ఒక యువకుడు తన భుజాలకు బ్యాగు తగిలించుకుని కూర్చున్న పిక్చర్ చూడవచ్చు. ఈ మేరకు దీనికి అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలని కోరిన అక్షయ్.. (కర్త కరే నా కర్సే శివ కారే సో హోయే) ‘ఈ జర్నీలో అందరినీ ఆ ఆదియోగి ఆశీర్వదిస్తాడు. హర హర మహదేవ్’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి కూడా నటించారు. ఇక ఈ మూవీ టాలీవుడ్‌లో స్టార్స్ పవన్ కల్యాణ్, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గోపాల గోపాల’ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.