కూలిన బ్రిటిష్ కాలంనాటి వంతెన

by srinivas |
కూలిన బ్రిటిష్ కాలంనాటి వంతెన
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట తూర్పుపాకలు గ్రామాల మధ్య గల బ్రిటిష్ కాలం నాటి పురాతన బ్రిడ్జి ఆదివారం కుప్పకూలింది. ఈ బ్రిడ్జి శిథిల స్థితికి చేరడంతో గత కొంతకాలంగా పెద్ద వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఈరోజు పూర్తిగా కూలిపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కాగా భారీగా కురుస్తోన్న వర్షాలకు బ్రిడ్జి కింది భాగంలో ఏలేరు ఉధృతిగా ప్రవహించడంతో ఇరువైపులా గట్లు కోతకు గురికావడం, మరోపక్క బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో నీటి ఎద్దడి తట్టుకోలేక కూలిపోయింది. దీంతో కాండ్రకోట, తూర్పు పాకలు గ్రామాల మధ్య ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు చుట్టూ తిరిగి రావాల్సి ఉండటంతో దూరాభారంగా మారిందని పలువురు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed