- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మతం కన్న మానవత్వమే మిన్న’
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల: మొహర్రం పర్వదినాన ముస్లిం యువకులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. మానవత్వమే సమాజ హితమని చేతల్లో చాటిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఒంటరిగా జీవిస్తున్న దుబ్బరాజు అనే వృద్ధురాలు ఆదివారం మరణించింది.
కరోనా వైరస్ భయంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కారోబార్ రాజేందర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ ముఖీద్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన వృద్దురాలి మృతదేహాన్ని స్మశానానికి తరలించి హిందూ సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మతం కన్న మానవత్వమే మిన్న అని భావించే తామీ కార్యక్రమానికి ముందుకు వచ్చామన్నారు.
Advertisement
Next Story