పెన్షన్ కోసం వెళ్లి శవమైన వృద్ధురాలు

by Sumithra |
పెన్షన్ కోసం వెళ్లి శవమైన వృద్ధురాలు
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఈనెల 11న పెన్షన్ కోసం వెళ్లిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు మళ్లీ తిరిగి రాలేదు. గుర్తు తెలియని దుండగులు ఆమెను చంపి ఓ ఇంట్లో పాతిపెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మర్ పల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న బంధువులు ఆమె ఒంటిమీద బంగారం కోసమే హత్యచేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story