- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓలా, ఉబర్ డ్రైవర్ల ప్రత్యేక డిమాండ్స్ ఇవే..!
దిశ, తెలంగాణ బ్యూరో : ఓలా, ఉబర్ యాప్ ఆధారిత డ్రైవర్లకు కూడా కొవిడ్ చికిత్స అందించాలని, ఏ చికిత్స పొందినా మూడు రోజుల్లేనే బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ స్టేట్ టాక్సీ, డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంస్థలను డిమాండ్ చేసింది. శుక్రవారం ఈ కమిటీ సమావేశాన్ని చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే డే సందర్భంగా నిరసన చేపట్టడమే కాకుండా యాప్ ఆధారిత అగ్రిగేటర్లను బహిష్కరిస్తామని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓలా, ఉబర్ లాంటి యాప్ ఆధారిత డ్రైవర్లు, తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లుగా పని చేస్తున్న 20 యూనియన్లు ఉన్నాయని, మొత్తంగా 35 వేల మంది సభ్యత్వాన్ని కలిగి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కొవిడ్ రూపంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీలైనంత త్వరగా తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కిలోమీటర్ కు ఫిక్స్ డ్ రేట్ ను పెట్టాలన్నారు. బేస్ ఫేర్ కిలోమీటర్ కు రూ.17-22 కంటే తక్కువ ఉండకూడదని, కాంపిటేటివ్ రేటు 50 శాతం కంటే తక్కువ ఉండకూడదని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, డ్రైవర్, ప్రయాణికుల మధ్య తెరలు అందించాలన్నారు. సంస్థల కమిషన్ ను 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ కారణంగా డ్రైవర్లు మృతి చెందితే అతడి కుటుంబసభ్యులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలన్నారు. కస్టమర్ పిక్ అప్ పాయింట్ మూడు కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలన్నారు.