- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్ల ప్రయోజనం కోసం ‘టిప్పింగ్’ ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. అన్ని రంగాలను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పలు సర్వేలు కూడా వెల్లడించాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చినా సరే.. క్యాబ్ సేవలు వినియోగించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే, తమను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినందుకు గాను, ఆ డ్రైవర్ బిహేవియర్‌ను పరిగణనలోకి తీసుకొని కొందరు కస్టమర్లు.. క్యాబ్ డ్రైవర్లకు టిప్ అందిస్తుంటారు. తాజాగా ‘ఓలా’ కూడా తమ క్యాబ్ డ్రైవర్ల ఆదాయం పెంచేందుకు, ఏకంగా టిప్పింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
డ్రైవర్లకు అప్రిషియేషన్ అందించడంతో పాటు వారు అందించిన సేవలకు కృతజ్ఞతగా టిప్పింగ్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఓలా తాజాగా ప్రకటించింది. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాల్లోని ‘ఓలా’ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఓలా పోటీదారైన ఉబెర్ 2017లోనే తొలిసారిగా యూఎస్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియాలోనూ ఈ ఫీచర్ జనవరి నుంచి అందుబాటులోకి వచ్చింది. కరోనా పాండమిక్ ఉన్నప్పుడు కూడా తమ ప్రాణాలకు తెగించి.. కస్టమర్ల కోసం క్యాబ్ సేవలు అందించారని, అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నారని ఓలా స్పోక్స్ పర్సన్ ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు. ఈ ఫీచర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుంది. పేమెంట్ ఫేస్‌లో ఫైనల్ స్టెప్‌లో టిప్పింగ్ ఫీచర్ కనిపిస్తుందని ఆనంద్ పేర్కొన్నారు. డ్రైవర్లందరికీ కూడా ఇది అదనపు ఆదాయమన్నారు.