- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు.. రోడ్డెక్కిన యజమానులు
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో హెచ్‌పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నాకు దిగారు. దీంతో దురాజ్‌పల్లి సమీపంలో ఉన్న హెచ్‌పీసీఎల్ టెర్మినల్‌లో 300 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. తమకు రావాల్సిన నెలవారీ రవాణా చెల్లింపుల్లో 80 శాతం కోత విధించారని సోమవారం వారు ఆందోళనకు దిగారు. హెచ్‌పీసీఎల్ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని, రూట్ మ్యాప్‌లు, టోల్ ఫీజు ఇవ్వట్లేదని ఆయిల్ ట్యాంకర్ యాజమానుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. శాటిలైట్ రూట్ పేరుతో కిలోమీటర్ల కోత పెట్టారని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఇలా కోత విధిస్తే డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు ఎలా ఇవ్వాలంటూ మండిపడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఘట్‌కేసర్, రామగుండం టెర్మినల్స్‌లోనూ ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేయనున్నట్టు యాజమాన్య సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ల యాజమానుల సమ్మెతో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది.