గవర్నర్ పిలుపు.. రాలేమన్న అధికారులు

by Shyam |
గవర్నర్ పిలుపు.. రాలేమన్న అధికారులు
X

దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో గవర్నర్ తమిళిసై అధికారులతో సమీక్షించాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు రావాలని చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా నిర్దేశించుకున్న కార్యక్రమాలతో సమావేశానికి రాలేమని అధికారులు చెప్పారు. దీంతో మంగళవారం సమీక్ష నిర్వహించాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో ప్రభుత్వ చర్యలపై గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితిని సమీక్షించనున్నట్లు గవర్నర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story