- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, న్యూస్ బ్యూరో: పోతిరెడ్డిపాడు జీవో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కృష్ణా నది యాజమాన్య బోర్డుతో సోమవారం భేటీ కానున్నారు. ఆ జీవోపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఇందులో భాగంగా ఆ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు ఆ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ అధికారులు నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కృష్ణా బోర్డు అధికారులతో ఆ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి, ఇంజనీర్లు, ఇతర అధికారులు సమావేశమై వివరణ ఇవ్వనున్నారు. కొత్తగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. అయితే కేంద్ర జల సంఘం నుంచి గానీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి గానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84 ప్రకారం కొత్త ప్రాజెక్టు కట్టాలంటే పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదికను అపెక్స్ కౌన్సిల్‌కు సమర్పించాలి. కానీ ఇవేవీ పాటించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిధులను మంజూరు చేయడం, జీవోను జారీ చేయడంతో వివాదాస్పదం అయ్యింది. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు ఆ రాష్ట్రానికి పంపించిన లేఖలో ప్రస్తావించింది. జీవో జారీ చేయడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సమర్ధించుకోవడంతో కృష్ణా బోర్డు దగ్గర అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.