- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా హరితహారం… మొక్కలు ఎంత విడ్డూరంగా నాటుతారంటే?
దిశ,మహేశ్వరం: తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటికీ ఏడో విడత హరితహరం కార్యక్రమం కొనసాగుతుంది. రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇవేమి మాకు పట్టింపులేనట్లు పెద్ద పెద్ద చెట్ల కిందనే చెట్లను (మొక్కలు) నాటడం జరుగుతున్న ఘటన మహేశ్వరం మండలంలోని మహేశ్వరం గేట్ నుంచి కొత్తూరు గేట్ వరకు శ్రీశైలం జాతీయ రహదారి కి ఇరువైపులా హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటారు.
రహదారికి ఇరవైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్ల కిందనే 7వ విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. పెద్ద పెద్ద చెట్ల కింద మళ్ళీ మొక్కలు నాటితే, మొక్కలు ఎలా పెరుగుతాయని రహదారి పై ప్రయాణం చేసే పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారుల తీరుచూస్తుంటే మొక్కలు నాటమంటే నాటాము అనే విధంగా ఉందంటున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెట్ల కింద చెట్లను నాటితే ఏ విధంగా పెరుగుతాయో అనే అవగాహన లేకపోవడం దురదృష్టకరమంటున్నారు.