- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో పెళ్లికి యత్నించిన అధికారి అరెస్ట్
దిశ, సికింద్రాబాద్: విద్యుత్ శాఖలో అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని చిలకలగూడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మూడో పెళ్లికి ప్రయత్నించిన కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ మ్యాట్రిమోనీలో మూడో పెళ్లికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి ఫిర్యాదుతో అతని నిర్వాకం వెలుగు చూసింది. చిలకలగూడ ఎస్సై వరుణ్ కాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాల్మన్ రాజు(42) అదే జిల్లాలో విద్యుత్ శాఖలో ఏ.ఈ గా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే ఇతనికి మొదట 15 సంవత్సరాల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఏపీకి చెందిన మరో యువతిని 8 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో మ్యాట్రిమోనీలో సికింద్రాబాద్ అంబర్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి పరిచయమైంది. వివాహం చేసుకుంటానని ఆమెను మోసగించాడు. అప్పటికే సదరు వ్యక్తికి వివాహం అయిందని తెలియక యువతి అతని మాయ మాటలు నమ్మింది. చివరకు ఆ విషయాన్ని పసిగట్టిన యువతి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.