- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క విద్యార్థి కోసం.. బస్ టైమింగ్స్‌లో మార్పు
దిశ, వెబ్‌డెస్క్: ఆ మధ్య జపాన్‌లో.. ఒక స్కూల్ విద్యార్థి కోసం స్పెషల్ ట్రైన్ నడిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒడిషాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఇక్కడ ట్రైన్ కాదు కానీ, ఓ విద్యార్థి అభ్యర్థన మేరకు బస్ టైమింగ్స్ మార్చిన భువనేశ్వర్ ట్రాన్స్‌పోర్ట్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
భువనేశ్వర్‌లోని స్థానిక ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న సాయి అన్వేష్ అమృతం ప్రధాన్.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లోనే స్కూల్‌కు వెళ్తుంటాడు. స్కూల్ టైమింగ్ ప్రకారం ప్రతిరోజు ఉదయం 7.30 నిమిషాలకే హాజరుకావాల్సి ఉంటుంది. కానీ అతడు వెళ్లే రూట్ బస్ 7.40 నిమిషాలకు వస్తుండటంతో డైలీ పాఠశాలకు లేట్‌గా వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులతో చివాట్లు తినడంతో పాటు క్లాసులు కూడా మిస్ అవుతున్నాడు. దీంతో ఆ విద్యార్థి ట్విట్టర్ వేదికగా ‘క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ భువనేశ్వర్’ (సీఆర్‌యూటీ)తో పాటు ఆ సంస్థ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బొత్రాను ట్యాగ్ చేస్తూ ‘బస్ టైమింగ్స్ వల్ల పాఠశాలకు రోజూ లేట్‌గా వెళ్తున్నాని.. మీరు దయతో ఈ విషయాన్ని పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే ఆ ఐఏఎస్ అధికారితో పాటు సీఆర్‌యూటీ స్పందించి, త్వరలోనే బస్ టైమింగ్స్ చేంజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బస్ టైమింగ్స్ మార్చడంతో ఆ కుర్రాడు కలెక్టర్‌తో పాటు భువనేశ్వర్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా నెటిజన్లు కూడా వారిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘ఇలా ప్రజల సమస్యల పరిష్కరించే గొప్ప నిర్ణయాలు తీసుకోవడం నిజంగా గ్రేట్. ఇదే స్ఫూర్తి అన్ని పనుల్లోనూ చూపిస్తే.. మన దేశం మరింత ఉన్నతంగా ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ విషయంలో ఇలాంటి స్పందన నేనెప్పుడు చూడలేదు. గ్రేట్ ఎఫర్ట్, నిజంగా ఇదో గొప్ప మార్పు.. సెల్యూట్ టు యువర్ డెడికేషన్ సార్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.