- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో టీకా కొరత.. అక్కడ 700 టీకా కేంద్రాల మూసివేత
భువనేశ్వర్ : ఒడిశాలో టీకా పంపిణీ దాదాపు సగం వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిలిచిపోయింది. సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారత్‌లో టీకా కొరత సవాల్‌ను విసురుతోంది. తమ రాష్ట్రంలో కేవలం రెండు రోజులకు సరిపడా టీకాలు మాత్రమే ఉన్నాయని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ లేఖ రాశారు. 7వ తేదీనాటికి 5.34 లక్షల డోసులున్నాయని, వీటితో రెండు రోజులు వ్యాక్సినేషన్‌ను కొనసాగించవచ్చునని వివరించారు.
కానీ, 9వ తేదీలోపు రాష్ట్రంలో డోసులు పూర్తికావచ్చునని పేర్కొన్నారు. దీంతో రెండో డోసు తీసుకోవాల్సిన వారిపై తీవ్ర ప్రభావం పడవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం సుమారు 1400 టీకా కేంద్రాల్లో పంపిణీ జరుగుతున్నదని, అందులో బుధవారం కేవలం 755 కేంద్రాల్లో మాత్రమే టీకాలు వేస్తున్నామని వివరించారు. అందుకే వెంటనే తమ రాష్ట్రానికి పదిరోజులకు సరిపడా అంటే, 25 లక్షల కొవిషీల్డ్ డోసులను పంపించాలని కోరారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు టీకా కొరతను ఎదుర్కొంటున్నాయి. తమకు టీకాలు పంపించాలని కేంద్రాన్ని సంప్రదించిన సంగతి తెలిసిందే.