- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతు’ క్రియేటివిటీ.. సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 300 కి.మీ
దిశ, ఫీచర్స్: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైమ్‌లో చాలామంది తమలో దాగున్న కళలను వెలికితీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురు ఫార్మింగ్‌పై దృష్టి సారించగా.. మరికొందరు సరికొత్త ఆవిష్కరణలకు పూనుకున్నారు. ఈ మేరకు ఒడిశాకు చెందిన రైతు.. తనకోసం స్పెషల్‌గా ఓ కారు డిజైన్ చేయాలనుకుని, చివరకు సౌరశక్తితో నడిచే ఎకో ఫ్రెండ్లీ వెహికల్‌ను రూపొందించాడు.
ఒడిషాలోని మయూర్భంగ్ జిల్లా, కరంజియా సబ్ డివిజన్‌కు చెందిన సుశీల్ అగర్వాల్.. లాక్‌డౌన్ టైమ్‌లో తనలో ఉన్న క్రియేటివిటీకి పని చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో తనుండే ఏరియాలోనే న్యూ ఐడియాస్ ఇన్వెన్షన్‌పై ఓ వర్క్‌షాప్ జరిగింది. ఆ సమావేశానికి హాజరైన సుశీల్.. అక్కడ పరిచయమైన మెకానిక్స్ సాయంతో వెహికల్ తయారీ మొదలెట్టాడు. 850 వాట్ల మోటార్‌తో పాటు 54 వోల్ట్‌ల బ్యాటరీ, ఇతర పార్ట్స్ ఒక్కొక్కటిగా అసెంబుల్ చేస్తూ వచ్చాడు. ఇలా వర్క్ చేస్తున్న క్రమంలో వెహికల్ పార్ట్స్ గురించి వివరాలు తెలుసుకునేందుకు సొంతంగా బుక్స్ చదవడంతో పాటు యూట్యూబ్ వీడియోలు చూశాడు. ఆ తర్వాత అన్ని పార్ట్స్‌ను అసెంబుల్ చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించాడు. ఆ విధంగా మొత్తం 8 నెలల పాటు శ్రమించి ఎట్టకేలకు వెహికల్ రూపొందించాడు. కాగా ఇందులో ఉండే బ్యాటరీ, సౌరశక్తి ద్వారా చార్జ్ అవుతుండటం విశేషం. దీన్ని చార్జ్ చేసేందుకు 8.30 గంటల సమయం పట్టనుండగా, సింగిల్ చార్జ్‌తో 300 కిలోమీట్లరు ప్రయాణించొచ్చు.
ఈ వెహికల్ తయారీకి సంబంధించిన ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, చేసిస వర్క్ అంతా వర్క్‌షాప్‌లో నేర్చుకున్న టెక్నిక్స్ ఆధారంగా చేసినట్లు.. ఇద్దరు మెకానిక్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వర్క్స్ చేసే తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని రూపొందించినట్లు సుశీల్ చెప్పారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని తాను లాక్‌డౌన్ కాలంలోనే ఊహించానని, అందుకే సొంత వెహికల్ తయారీకి పూనుకున్నానని తెలిపారు. వెహికల్ పైభాగంలో ఉండే సోలార్ ప్యానెల్స్ ద్వారా చార్జ్ అయ్యే ఈ వాహనాన్ని చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తనంతట తానుగా ఓ రైతు సోలార్ బ్యాటరీ పవర్డ్ వాహనం తయారు చేయడం ప్రశంసనీయమని, ఇలాంటి పర్యావరణహిత వాహనాలే రేపటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ భవిష్యత్తు అని ఆర్టీఓ గోపాలకృష్ణ దాస్ పేర్కొన్నాడు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు చేసేవారికి భారత ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. ఈ వెహికల్ ఇండియన్ రోడ్స్‌కు సూటబుల్ అయ్యేలా ఎఫీషియెన్సీ చెక్ చేసి, సేఫ్టీ పెంచే చర్యలు తీసుకోవాలన్నారు.