- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో 12.54 శాతంతో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తయారీ వస్తువులు, ఇంధన ధరలు గణనీయంగా పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వరుసగా ఇది ఏడో నెలలో రెండంకెల పైన నమోదైందని గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 10.66 శాతంగా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో 1.31 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. పరిశ్రమల శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇంధన ద్రవ్యోల్బణం సమీక్షించిన నెలలో 24.8 శాతం నుంచి 37.2 శాతానికి పెరిగింది. అలాగే తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 11.4 శాతం నుంచి 12 శాతానికి చేరుకుంది.
అయితే కూరగాయల ధరలు ఏడాది క్రితం కంటే తక్కువగా ఉండటంతో ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.7 శాతం తగ్గింది. ‘సమీక్షించిన నెలలో ప్రధానంగా మినరల్ ఆయిల్స్, బేస్ మెటల్స్, ఆహార ఉత్పత్తులు, ముడి చమురు, సహజవాయువు, దుస్తులు, ప్లాస్టిక్, వంటనూనె, కెమికల్స్, కెమికల్ ఉత్పత్తులు మొదలైన వాటి ధరలు గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయని’ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంధన, ఆహార ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో అక్టోబర్ నెలకు సంబంధించి రీటైల్ ద్రవ్యోల్బణం 4.48 శాతానికి స్వల్పంగా పెరిగినట్టు ఇటీవల సీపీఐ ద్రవ్యోల్బణ సూచీ ప్రకటించింది.