ఆటో అమ్మకాల రికవరీలో స్పష్టత

by Harish |
ఆటో అమ్మకాల రికవరీలో స్పష్టత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమ ప్రస్తుతం రికవరీని చూడగలుగుతోందని, అయితే, ఈ స్థిరత్వం అక్టోబర్, నవంబర్ చివరి నాటికి అమ్మకాలు ఎలా ఉంటాయనే దానిపై ఆధారపడి ఉంటుందని హోండా కార్స్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రజా రవాణా తగ్గి వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి పెరిగిన క్రమంలో ప్రస్తుత డిమాండ్ ఉందని, గ్రామీణంలో పెరిగిన వాహన అమ్మకాలతో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇది ఎంతకాల ఉంటుందో చూడాలని ఆయన పేర్కొన్నారు.

‘ఆటో పరిశ్రమలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నప్పటికీ, ఇది అక్టోబర్, నవంబర్ చివరికి ఎలాంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటుందో చూడగలిగితేనే స్పష్టత వస్తుందని’ హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేష్ గోయెల్ అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్ పరిశ్రమకు కీలకం. సెప్టెంబర్‌లో ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ పండుగ సీజన్‌లో డిమాండ్‌ను తీర్చే స్థాయిలో డీలర్‌షిప్‌ల వద్ద వాహనాలు ఉండాలని రాజేశ్ గోయెల్ చెప్పారు. అప్పుడే ఉత్పత్తి అయిన ప్రతీ కారు అమ్ముడవుతుందన్నారు.

Advertisement

Next Story