- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా వైరస్‌ను పెంచుతున్న న్యూజిలాండ్
అవును.. మీరు చదివింది కరెక్టే ! చైనా కాదు న్యూజిలాండ్ సైంటిస్టులే కరోనా వైరస్‌ను పెంచుతున్నారు. అయితే అదేదో చెడు పనుల కోసమో, జీవాయుధాలను సృష్టించడం కోసమో కాదు.. మంచి ప్రయోజనం కోసమే. వ్యాక్సిన్ కానీ, మందు కానీ కనిపెట్టాలంటే ముందు బతికున్న కరోనా వైరస్ కావాలి కదా.. అందుకే ల్యాబ్‌లోని ప్రత్యేక వాతావరణంలో ఈ కొవిడ్ 19 వైరస్‌ను పెంచుతున్నారు.
కొవిడ్ 19 పేషెంట్ల నుంచి ఒటాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ మిగేల్ క్వినోన్స్ మాటే, ఆయన సహశాస్త్రవేత్తలు కలిసి మార్చిలో బతికున్న కొవిడ్ 19 వైరస్‌ను ఐసోలేట్ చేయగలిగారు. మొత్తం ఏడుగురు పేషెంట్ల నుంచి ఈ వైరస్‌ను సంగ్రహించారు. ప్రత్యేకంగా సూట్ ధరించి ప్రయోగాలు నిర్వహించే పీసీ3 రకం ల్యాబ్‌లో దీన్ని పెంచాల్సిఉంటుంది. సాధారణంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లను పీసీ2 రకం ల్యాబ్‌లో పెంచుతారు. కానీ కరోనా వైరస్ గురించి ఇంకా పూర్తిస్థాయిలో అధ్యయనం జరగలేదు కాబట్టి పీసీ3 ల్యాబ్‌ను కేటాయించారు. అయితే వైరస్‌లను పెంచడం కూడా ఇంట్లో చెట్లను పెంచడం లాంటిదేనని వైరాలజీ టీమ్ లీడర్ లారెన్ జెల్లీ అంటున్నారు. ప్రతీరోజు కణాల ఎదుగుదలను గమనిస్తూ వాటిని జాగ్రత్తగా పెంచాలని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆఫ్రికన్ ఆకుపచ్చ కోతుల కిడ్నీల నుంచి తీసిన కణాలను కరోనా వైరస్‌కు ఆహారంగా వేసి పెంచుతున్నట్లు ఆమె చెప్పారు. కణాలలో వైరస్ వృద్ధి చెందిన తర్వాత పీసీఆర్ పరీక్షలు నిర్వహించి కరోనాను గుర్తించి, దాన్ని వేరే కంటైనర్‌లో తీసుకుని దీర్ఘకాలం నిల్వ ఉంచుతామని ఆమె వివరించారు. ఈ భద్రపరిచిన వైరస్‌ను కరోనా గురించి అధ్యయనం చేస్తున్న సైంటిస్టుల అవసరాల నిమిత్తం పంపిస్తామని లారెన్ చెప్పారు.