- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీలో ‘ఉత్తమ నర్సు‘ ఎవరు? దరఖాస్తు చేసుకోండిలా…
దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ, విశేష సేవలు అందించిన నర్సులను గుర్తించి అవార్డులు అందజేయడానికి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతీ సంవత్సరం మే నెల 12వ తేదీన ప్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ అని, అదే రోజున ‘ఉత్తమ‘ నర్సులను ప్రకటించాలనుకుంటున్నట్లు సంస్థ పేర్కొంది. నర్సింగ్ వృత్తిలో ఉన్నవారు సామాజిక బాధ్యతగా పేషెంట్లకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ఏడాది కాలంగా కరోనా కష్టకాలంలో స్వంత ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని కొనియాడిన సంస్థ విశేష సేవలను అందించినవారిని గుర్తించి సత్కరించాలనుకుంటున్నట్లు పేర్కొంది.
ఇందుకోసం వచ్చే నెల 2వ తేదీ లోగా దరఖాస్తులను వెబ్‌సైట్ (www.nursingofficersassociation.com) ద్వారానే భర్తీ చేసి సమర్పించాలని కోరింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులంతా అర్హులేనని తెలిపింది. నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. క్లినికల్, టీచింగ్ రంగాల్లో ఉన్న నర్సులు కూడా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. ‘ఉత్తమ‘ నర్సులుగా ఎంపికైన వారిని నైటింగేల్ జయంతి సందర్భంగా వారిని అవార్డ్ తో సత్కరించనున్నట్టు తెలిపింది.