- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రమాత్రలు మింగి నర్స్ ఆత్మహత్యాయత్నం.. కారణం అదేనా ?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. కరోనా విపత్కర సమయంలో గత ఏడాది జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులుగా 70 మందిని నియమించారు. అయితే వీరిని నెల రోజుల క్రితం విధుల నుంచి తొలిగించారు. దీంతో వారందరూ వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నా, న్యాయం జరగకపోవడంతో ఆందోళన చెందిన క్రిస్టియన్ పల్లికి చెందిన సుజాత అనే యువతి, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు హుటాహుటిన ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు మింగిన సుజాతకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోవడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సుజాత కొంతమందితో వెల్లడించినట్లు సమాచారం.