బాత్‌రూంలో కొవిడ్ షేషెంట్‌తో నర్సు శృంగారం..

by Anukaran |   ( Updated:2020-12-30 08:39:47.0  )
బాత్‌రూంలో కొవిడ్ షేషెంట్‌తో నర్సు శృంగారం..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తితో బాత్‌రూంలో ఓ నర్సు శృంగారం చేసింది. అందుకోసం కొవిడ్ వార్డులో అన్ని సమయాల్లో ధరించాల్సిన పీపీఈ కిట్‌ను కేవలం శృంగారానికి అడ్డు వస్తుందని ఆమె తొలగించింది. ఈ విషయాన్ని నర్సుతో సెక్స్ చేసిన కొవిడ్ షేషెంట్ సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. వీరిద్దరూ కలిసి గుట్టుగా చేసుకున్న చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను కూడా షేర్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటన ఇండోనేషియా దేశం జకార్తా రాజధానిలోని విస్మా అట్‌లెట్ క్వారంటైన్ సెంటర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆస్పత్రి వర్గాల చెవిన పడటంతో ఆ నర్సును విధుల నుంచి తప్పించారు. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు లెఫ్ట్ నెంట్ కల్నల్ హర్విన్… నర్సుతో పాటు కొవిడ్ షేషెంట్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత కేసును సెంట్రల్ జకార్తా పోలీసులకు బదిలీ చేశామన్నారు. నర్సును తదుపరి విచారణ కోసం రిమాండ్‌లో ఉంచగా.. కొవిడ్ షేషెంట్‌ను ఐసోలేషన్ సెంటర్‌కు తరలించినట్లు కల్నల్ హర్విన్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story