మాస్టర్ డైరెక్టర్‌తో తారక్ నెక్ట్స్?

by Shamantha N |
మాస్టర్ డైరెక్టర్‌తో తారక్ నెక్ట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పక్కాగా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకోనున్న తారక్.. తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ప్రకటించిన మూవీ షూటింగులో పాల్గొననున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత తారక్ ప్రాజెక్ట్ ఏంటి? అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మూవీ అనుకున్నా అది జరగలేదు. తను ప్రభాస్‌తో సలార్ సినిమా ప్రకటించేశాడు. దీంతో ఇప్పుడు క్రేజీ రూమర్ బయటకు వచ్చింది.

“మాస్టర్” సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. తారక్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడని టాక్. మాస్టర్ తెలుగు సినిమా హక్కులు సొంతం చేసుకున్న నిర్మాత మహేష్ కోనేరు, ఈ కాంబినేషన్ సెట్ చేశాడని తెలుస్తోంది. మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నాయని సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనకరాజు కమల్ హాసన్ “విక్రమ్” ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉండగా.. తారక్ త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇవి రెండు పూర్తి కాగానే ఇద్దరి కాంబినేషన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట.

Advertisement

Next Story