కేజీఎఫ్ డైరెక్టర్ తారక్ సినిమాపై క్రేజీ ట్వీట్!

by Shyam |   ( Updated:2020-05-20 03:29:10.0  )
కేజీఎఫ్ డైరెక్టర్ తారక్ సినిమాపై క్రేజీ ట్వీట్!
X

కేజీఎఫ్ మూవీతో రికార్డ్స్ కొల్లగొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కంట్రీవైడ్‌గా తనపై అటెన్షన్ క్రియేట్ చేసుకున్నాడు. కేజీఎఫ్‌కు మించిన రికార్డ్స్‌ను కొల్లగొట్టేందుకు తన నెక్స్ట్‌ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఎంచుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. అయితే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ డైరెక్టర్ చేసిన ట్వీట్.. ఈ విషయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసింది.

‘ఫైనల్‌గా ఒక న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూచుంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నా.. ఇలాంటి ఒక క్రేజీ పవర్ చుట్టూ నా రేడియేషన్ ఉంటే ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తా..’ అంటూ తారక్ అభిమానులకు హామీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.. ఒక గొప్ప రోజున కలుద్దాం’ అని ట్వీట్ చేశాడు. కాగా ఈ సూపర్ కాంబినేషన్‌ను మైత్రి మూవీస్ తెరమీదకి తీసుకురానుందట.

ప్రశాంత్ నీల్ ట్వీట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తారక్ అభిమానులు.. ట్వీట్‌లోనే ఇంత ఎలివేషన్ ఇచ్చారంటే.. సినిమా ఎంత రచ్చ రచ్చ చేస్తుందో ఇమాజిన్ చేసుకోవచ్చని సంబరపడి పోతున్నారు.

Advertisement

Next Story