- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ హక్కుల కమిషన్‌కు ఎన్ఎస్‌యూఐ లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్నిరకాల పరీక్షలను రద్దు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులను ప్రోత్సహించాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థుల నుంచి ఎన్ఎస్‌యూఐ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలపై 12వేల లేఖలను మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బలుమూరి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను లేఖల రూపంలో సమర్పించామన్నారు.
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఇబ్బందిగా మారిందన్నారు. దేశంలో డిజిటల్ అసమానత ఉందని, సమాజంలో ఒక ప్రధాన వర్గానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు లేవని, దేశంలోని గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రాథమికంగా ఉన్నాయని పేర్కొన్నారు.