- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్రీ అంబులెన్స్ ఫెసిలిటీ.. పెద్దమనసు చాటుకున్న NSUI లీడర్స్
దిశ, షాద్‌నగర్: కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న విపత్కర పరిస్థితుల్లో యూత్ కాంగ్రెస్(NSUI) నాయకులు మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో అవస్థలు పడుతున్న పేదవారికి పార్టీలకు అతీతంగా సాయం చేస్తూ కొండంత భరోసా ఇస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత లాక్‌డౌన్ విధించడంతో ఆస్పత్రుల వద్ద రోగుల బంధువులు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసిన షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేయడమే కాకుండా, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు అందిస్తూ పెద్దమనసు చాటుకున్నారు. అలాగే షాద్‌నగర్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తన పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోవిడ్ బాధితులకు దాదాపు 5000 మెడికల్ కిట్‌లను పంపిణీ చేశారు. అదేవిధంగా షాద్‌నగర్ ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కాట సుధీర్‌లు రాహుల్ భరోసా పేరిట ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు.