- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా కట్టడికి..ప్రవాసీయులు రూ.3లక్షల విరాళం
దిశ, నల్లగొండ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తమవంతు సాయం అందించేందుకు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు డాక్టర్ గోలి శైలజ, డాక్టర్ వడ్డే రాజేష్ రెడ్డి, డాక్టర్ వడ్డే రాకేష్ రెడ్డిలు రూ.3 లక్షల విరాళం ప్రకటించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దాతల తరఫున వారి ప్రతినిధులు డాక్టర్ కోట సత్యనారాయణ రెడ్డి, నీరజ, సురేందర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ..కరోనా నివారణకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం విరాళం అందజేసిన కోట సత్యనారాయణ రెడ్డి, నీరజ, సురేందర్ రెడ్డిలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Tags :cmrf fund, 3 lacs, Nris, dist collector office, minister jagadish reddy