TANA:తానా 2025 మహాసభల కోసం కొత్త ప్రణాళిక కమిటీ నియామకం.. వేదికగా డెట్రాయిట్‌..!

by Maddikunta Saikiran |
TANA:తానా 2025 మహాసభల కోసం కొత్త ప్రణాళిక కమిటీ నియామకం.. వేదికగా డెట్రాయిట్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association Of North America) 24వ మహాసభలు మిచిగాన్ (Michigan) రాష్ట్రం డెట్రాయిట్ (Detroit) లో నిర్వహించాలని తానా అధికారులు నిర్ణయించారు. 2025 జులై మొదటి వారంలో ఈ వేడుకలు జరగనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ మహాసభలకు కో-ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్(Uday Kumar), చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ల(Gangadhar Nadella) నియమితులైనట్లు ‘తానా’ సెక్రటరీ రాజా కసుకుర్తి(Raja Kusumurthy) తెలిపారు. ఈ మేరకు బోర్డు, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.నోవి సబర్బన్ షో ప్లేస్ లో జరిగే ఈ మీటింగ్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసేందుకు ప్రణాళిక కమిటీని నియమించినట్లు కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు.కాగా ప్రతిపదేళ్ళకు ఒకసారి తానా మహాసభలు డెట్రాయిట్లో జరగడం సంప్రదాయంగా వస్తోంది. తానా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ , షిర్డీ సాయి సంస్థాన్ , శ్రీ వెంకటేశ్వర ఆలయం , ఇండియా లీగ్ అఫ్ అమెరికాలో పలు నాయకత్వ బాధ్యతలతో పాటు , తానా ,2005 ,2015 సమావేశాలు సమర్థ వంతంగా నిర్వహించిన అనుభవం ఈ కమీటీ సభ్యులకు ఉందని ఉదయ్ కుమార్ వెల్లడించారు.డెట్రాయిట్లో జరగనున్న తానా సదస్సుకు ప్రతిభావంతులను బాధ్యులుగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోందని ‘తానా’ కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు.ఈ కాన్ఫరెన్స్ లో వాలంటీర్లుగా వర్క్ చేయాలనుకునే వారు తమ పేర్లను www.tanaconference.org ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీలో సభ్యులు వీరే :

  • గంగాధర్ నాదెళ్ల (Chairman) - నిధుల సేకరణ
  • శ్రీనివాస్ కోనేరు (Co-ordinator) - ఆర్థిక,ఆదాయ విభాగాలు
  • సునీల్ పాంట్రా (Conference Director) -సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు
  • కిరణ్ దుగ్గిరాల (Secretary) - ప్రణాలిక వ్యయం
  • జోగేశ్వర్ రావు (Tresurer) -వేదిక , హోటళ్లు, భోజన ఏర్పాట్లు
  • నీలిమ మన్నె (Tana North region Member) - పోటీలు,మహిళలు, పిల్లల కార్యకపాలు
Advertisement

Next Story

Most Viewed