లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఏఈ

by Sridhar Babu |   ( Updated:2021-11-06 05:48:28.0  )
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఏఈ
X

దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి సబ్ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎన్ పీడీసీఎల్ ఏఏఈ రాజ్ కుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం బాధితుడు, నిందితుల నుండి పూర్తి వాంగ్మూలాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారుల బృందం నిమగ్నమైంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్‌చార్జి డీఎస్పీ మధుసూధన్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో సీఐ ఎస్పీ రవీందర్‌తో పాటు పలువురు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story